![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -469 లో....జ్యోత్స్నని పారిజాతం కొడుతుంది. నేను నా రక్తసంబంధం వాల్లే సంతోషంగా ఉండాలనే స్వార్థపరురాలిని.. నేను అలా ఆలోచించబట్టే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావని పారిజాతం కోప్పడుతుంది. అసలు మావయ్యకి హెల్ప్ చెయ్యమని చెప్పిందే నేనని జ్యోత్స్న అంటుంటే.. నీ నాటకాలు నా దగ్గర కాదు ఇంకొకసారి నీ నాన్న, తమ్ముడు సహాయం కోసం వస్తే చెయ్.. లేదంటే నాకు చెప్పమని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది.
ఆమ్మో గ్రానీ ఇంత వైలెంట్ గా ఉందేంటి.. కొంపదీసి నేనే తన కొడుకుని చంపాలని ట్రై చేసానని తెలిస్తే నన్ను చంపేస్తుందని.. తెలియకుండా జాగ్రత్తపడాలని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు జ్యోత్స్న మాటలకు కాంచన బాధపడుతుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. దీపకి నీకు ఒక బిడ్డ ఎందుకు ఉండకూడదని శౌర్యకి తోడుగా ఉంటుంది కదా అని కాంచన అనగానే అవన్నీ ఆలోచించకని కార్తీక్ అంటాడు. మరుసటి రోజు కార్తీక్ దగ్గరికి శ్రీధర్ వస్తాడు. మనమందరం కలిసి వెళ్లాడానికి వచ్చానని శ్రీధర్ అనగానే కాంచన కోపంగా మాట్లాడుతుంది.
నా కోసం తనతో వెళదామని కార్తీక్ అంటాడు. దానికి కాంచన సరే అంటుంది. ఆ తర్వాత కాంచన కుటుంబం వస్తుందని సుమిత్ర అన్ని వంటలు చేస్తుంది. అప్పుడే కాంచన కుటుంబం వస్తుంది. అక్కడే ఉన్నావేంటి దీప.. మధ్యాహ్నం భోజనం టైమ్ అయింది రండి అనీ సుమిత్ర అనగానే దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |